వోక్స్ వ్యాగన్ కేసులో బొత్సకు సీబీఐ నోటీసులు

వోక్స్ వ్యాగన్ కేసులో బొత్సకు సీబీఐ నోటీసులు

వోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు శుక్రవారం నోటీసులు ఇచ్చింది. సెప్టెంబర్ 12న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విశాఖపట్నంలో కార్ల ఫ్యాక్టరీ పెట్టేందుకు వోక్స్ వ్యాగన్ కు మధ్యవర్తిగా ఉన్న వశిష్ట వాహన్ అనే సంస్థకు ఏపీ సర్కారు రూ.12 కోట్లు చెల్లించింది. అయితే తనకు ఆ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని వోక్స్ వ్యాగన్ చెప్పడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2005లో కేసు నమోదు చేసిన సీబీఐ  రూ.7 కోట్లు రికవరీ చేసింది. ఈ స్కామ్ జరిగినప్పుడు బొత్స సత్యనారాయణ భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు.