రివ్యూ: గ్యాంగ్ లీడర్

రివ్యూ: గ్యాంగ్ లీడర్

రివ్యూ: గ్యాంగ్ లీడర్

రన్ టైమ్: 2 గంటల 37 నిమిషాలు

నటీనటులు: నాని,కార్తికేయ,ప్రియాంక మోహన్,లక్ష్మీ,శరణ్య,వెన్నెల కిషోర్,ప్రియదర్శి తదితరులు

సినిమాటోగ్రఫీ: మిరోస్ లా కుబా

మ్యూజిక్: అనిరుధ్

నిర్మాతలు: మైత్రీ మూవీస్

రచన,దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్

రిలీజ్ డేట్: సెప్టెంబర్ 13,2019

కథేంటి?

పెన్సిల్ పార్థసారథి (నాని) ఓ రచయిత.హాలీవుడ్ రివేంజ్ సినిమాలను చూస్తూ..బుక్స్ రాస్తుంటాడు.. ఓ లేడి గ్యాంగ్ అతని దగ్గరికి వచ్చిన ఒకతన్ని చంపాలి.దానికోసం పెన్సిల్ హెల్ప్ కావాలని అడుగుతారు.అసలు వాళ్ల రివేంజ్ ఏంటి? వాళ్లతో కలిసి పెన్సిల్ ఏ రకంగా విలన్ ను చంపారు అనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

హీరో నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పెన్సిల్ పార్థసారథి పాత్రలో ఫుల్ గా ఎంటర్ టైన్ చేశాడు.హీరోయిన్ ప్రియాంక మోహన్ అందంగా ఉంది.నటనతో కూడా మెప్పించింది.విలన్ గా నటించిన కార్తికేయ రాణించాడు.సీనియర్ నటి లక్ష్మీ,శరణ్య లు తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.ప్రియదర్శి,వెన్నెల కిషోర్ లు కామెడీ కోసం ట్రై చేశారు.

టెక్నికల్ వర్క్:

మిరోస్ లా కుబా సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది.అనిరుద్ మ్యూజిక్ కి ఎక్కువ మార్కులు పడతాయి.సాంగ్స్ అన్నీ వినసొంపుగా ఉన్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సీన్లను బాగా హైలైట్ చేశాడు.రాజీవన్ ఆర్ట్ వర్క్ బాగుంది.ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది.డైలాగులు బాగున్నాయి.కొన్ని కామెడీ పంచ్ లు బాగా పేలాయి.

విశ్లేషణ:

‘‘గ్యాంగ్ లీడర్’’ ఎంటర్ టైనింగ్ వే లో సాగే ఓ రివేంజ్ స్టోరీ..పాయింట్ బాగానే ఉన్నా డైరెక్టర్ విక్రమ్ కుమార్ రాసుకున్న స్క్రీన్ ప్లే పకడ్బందీగా లేకపోవడం వల్ల ఈ సినిమా సోసో గా అనిపిస్తుంది..రివేంజ్ కథ లో ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా ఉండాలి..రివేంజ్ తీర్చుకునే వాళ్ల కథలో సింపతీ ఉండాలి.అప్పుడు ఇలాంటి కథలు సక్సెస్ అవుతాయి.కానీ గ్యాంగ్ లీడర్ లో విలన్ వల్ల జరిగిన అన్యాయం అనే పాయింట్ ఏ దశలో ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.దానికి తోడు కథనం లో లోపాలు,సెకండాఫ్ ల్యాగ్ ఉండటం వల్ల అంతగా ఆకట్టుకోదు.హీరో నాని యే ఈ సినిమాకు సేవింగ్ గ్రేస్.తన టైమింగ్,పర్ఫార్మెన్స్ తో నార్మల్ సీన్లను కూడా హైలైట్ చేశాడు. ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్ గా సాగినా..సెకండాఫ్ ల్యాగ్ అయింది.చివరి 20 నిమిషాలు మరీ బోర్ కొడుతొంది. ఇష్క్, మనం, 24, హలో లాంటి సినిమాలతో టాలెంటెడ్ మేకర్ అనపించుకున్న విక్రమ్ కుమార్ ఈ సినిమాలో తన మార్క్ చూపించలేకపోయాడు. ఓవరాల్ గా ఈ ‘‘గ్యాంగ్ లీడర్’’ టైమ్ పాస్ కోసం ఓకే అనిపించినా.. పూర్తిగా సాటిస్ ఫై చేయదు.