ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా

ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా

బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఆస్పత్రిలో చేరారు. 70 ఏళ్ల నసీరుద్దీన్ న్యూమోనియాతో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా న్యుమోనియాతో ఆయన బాధపడుతున్నారని నసీరుద్దీన్ షా భార్య రత్న పాథక్ తెలిపారు. నిన్ననే(మంగళవారం)ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించామని... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు.

 ఊపిరితిత్తుల్లో ప్యాచ్ కారణంగా ఆయన బాధ పడుతున్నారని.. చికిత్సకు నసీరుద్దీన్ బాగా స్పందిస్తున్నారని ఆయన మేనేజర్ తెలిపారు. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.