ఎస్టీల భూమి సేకరిస్తుంటే ఏం చేశారు

ఎస్టీల భూమి సేకరిస్తుంటే ఏం చేశారు

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. యాపల్ గూడ, రాంపూర్ గ్రామంలోని రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితుల కేసు విచారించింది జాతీయ ఎస్టీ కమిషన్. ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎస్టీల భూమి సేకరిస్తుంటే ఏం చేశారని కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 107 ఎకరాల భూమిని తిరిగి భూ నిర్వాసితులకు ఎందుకు ఇవ్వకూడదో వివరణ ఇవ్వాలని కలెక్టర్ ను కమిషన్ ఆదేశించింది.

భూమి ఇప్పించిన ఎమ్మెల్యే జోగు రామన్న, ఆర్డీఓ సూర్యనారాయణపై ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు పెట్టకూడదని జాతీయ ఎస్టీ కమిషన్ ప్రశ్నించింది. ఈ కేసులో తదుపరి విచారణ నెల రోజులకు వాయిదా వేసింది. 2018లో ఉద్యోగాల ఇప్పిస్తామని చెప్పి రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం యాజమాన్యం భూమిని సేకరించింది. మూడేళ్లు పూర్తయినా సిమెంట్ ఫ్యాక్టరి ఏర్పాటు కాలేదని తెలిపింది. కాగా, వ్యవసాయ భూములు తిరిగి ఇవ్వాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.. భూ నిర్వాసితుల కోసం జాతీయ ఎస్టీ కమిషన్ లో సుహాసిని రెడ్డి పిటిషన్ వేసి పోరాడుతున్నారు.