క్రిప్టో కరెన్సీ అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకూడదు

క్రిప్టో కరెన్సీ అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకూడదు

డిజిటల్  శకం  మన చుట్టూ  ఉన్న ప్రతిదాన్నీ మార్చేస్తోందని,  రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలకు కొత్త  అర్థాలు చెబుతోందన్నారు  ప్రధాని నరేంద్ర మోడీ.  రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సమాజానికి  టెక్నాలజీ  కొత్త నిర్వచనం  ఇచ్చిందని చెప్పారు . అయితే  పాలన , నీతి,  చట్టం, హక్కులు , భద్రతపై  టెక్నాలజీ  కొత్త ప్రశ్నలను,  సవాళ్లను లేవనెత్తుతోందన్నారు   మోడీ. ఆస్ట్రేలియాలో  జరుగుతున్న  ది సిడ్నీ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్  ద్వారా ఆయన  పాల్గొన్నారు. ఇండియా   టెక్నాలజీ: ఎవల్యూషన్  అండ్  రివల్యూషన్ పై  కీలక ప్రసంగం  చేశారు.  క్రిప్టో  కరెన్సీపై  దేశాలన్నీ కలిసి పనిచేయాలని, అది అసాంఘిక శక్తుల చేతుల్లోకి  వెళ్లకుండా చూసుకోవాలని పిలుపు ఇచ్చారు.