'గాడ్ ఫాదర్'లో నయన్ ఫస్ట్ లుక్ రిలీజ్

'గాడ్ ఫాదర్'లో నయన్ ఫస్ట్ లుక్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'గాడ్ ఫాదర్'. ఈ సినిమాలో నయనతార ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఆమె లుక్ రివీల్ చేస్తూ మూవీ మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.  ఈ పిక్ లో నయనతార చాలా సింపుల్ గా కనిపిస్తు్న్నారు. అంతే కాకుండా ఈ మూవీలో చిరుకి చెల్లెలుగా నయన్ నటించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. పెళ్లి తర్వాత మళ్లీ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్న నయనతారను చూసి ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇక మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘గాడ్ ఫాదర్’ సినిమాను కొణిదెల ప్రొడ‌క్షన్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ చిత్రం లూసీఫర్ రీమేక్‌గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నమోదవుతున్నాయి. ఇంతకు ముందే విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా... గాడ్ ఫాదర్ మూవీ టీజర్‌ను ఈ నెల 21న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. ఇక అక్టోబర్ 5న ఈ సినిమాను థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మూవీ నిర్వాహకులు ప్రకటించారు.