మేడారంలో బాలికపై అత్యాచారం.. సుమోటో గా స్వీకరించిన ఎన్సీడబ్ల్యూ!

మేడారంలో బాలికపై అత్యాచారం.. సుమోటో గా స్వీకరించిన ఎన్సీడబ్ల్యూ!

న్యూఢిల్లీ, వెలుగు: మేడారం జాతరలో బాలికపై అత్యాచార ఆరోపణలపై మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలపై నేషనల్ విమెన్ కమిషన్ (ఎన్‌‌సీడబ్ల్యూ) స్పందించింది. చత్తీస్‌‌గఢ్‌‌కు చెందిన ఐదుగురు యువకులు ఈ దారుణానికి ఒడిగట్టారని, ఇది సామూహిక అత్యాచారమని వస్తున్న వార్తలను సుమోటోగా స్వీకరించింది. 

ఈ ఘటనపై ఎన్‌‌సీడబ్ల్యూ చైర్‌‌ పర్సన్ విజయా రహాట్కర్ విచారణకు ఓ కమిటీని నియమించారు. ఎన్‌‌సీడబ్ల్యూ సభ్యురాలు డెలినా ఖోంగ్డప్​ను కమిటీకి అధ్యక్షురాలిగా, సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖట్టర్ ను సభ్యురాలిగా నియమించారు. వీరితో పాటు ములుగు జిల్లా న్యాయసేవల అధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) నియమించే ఒక న్యాయవాది కమిటీకి సహకరించనున్నారు.