ఈ పరిస్థితుల్లో నీట్, JEE పరీక్షలు వద్దు: సుబ్రమణియన్ స్వామి

ఈ పరిస్థితుల్లో నీట్, JEE పరీక్షలు వద్దు: సుబ్రమణియన్ స్వామి

కరోనా కారణంగా నీట్, JEE పరీక్షలు వాయిదా వేయాలని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి మరోసారి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించడం అతి పెద్ద తప్పిదమన్నారు. 1976లో అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం చేపట్టిన నాస్‌బందీ తో ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణను పోల్చారు.  ఈ కారణంగానే 1977 ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భారతీయ ఓటర్లు నిశ్శబ్దంగా బాధను అనుభవించినప్పటికీ దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

సుప్రీం తీర్పుతో ‌జాతీయ స్థాయి ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు జేఈఈ ( JEE ),నీట్‌( NEET) లు కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి ఎన్టీఏ అడ్మిట్ కార్డులను కూడా వెబ్‌సైట్‌లో ఉంచామని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని శుక్రవారం సూచించింది. జేఈఈ మెయిన్ సెప్టెంబ‌ర్ 1 నుంచి 6 వ‌ర‌కు, నీట్ సెప్టెంబ‌ర్ 13న జ‌ర‌గ‌నుంది. అదేవిధంగా ప్ర‌తిష్టాత్మక విద్యాసంస్థ‌లైన ఐఐటీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే JEE అడ్వాన్స్‌డ్ సెప్టెంబర్‌ 27న జ‌ర‌గ‌నుంది.