- క్షుణ్నంగా పరిశీలించిన భారత్
న్యూఢిల్లీ: హింసాత్మక ‘జెన్జెడ్’ నిరసనల తర్వాత నేపాల్‌లో మొదటిసారి జరిగిన ఎలక్షన్లు ప్రశాంతంగా ముగిశాయి. అవినీతి నిర్మూలన, దేశంలో మార్పులను కోరుతూ గతేడాది సెప్టెంబర్‌లో నేపాల్యువత జెన్జడ్పేరుతో తీవ్ర ఆందోళనలు చేట్టిన విషయం తెలిసిందే. దీంతో కేపీ ఓలీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో గురువారం జరిగిన ఎన్నికలు జరిగాయి.
దేశంలో 1.89 కోట్ల ఓటర్లుండగా 60 శాతం ఓటింగ్నమోదైందని తాత్కాలిక ప్రధాన ఎన్నికల కమిషనర్ రామ్ ప్రసాద్ భండారీ తెలిపారు. 275 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి 6541 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నేపాలీ కాంగ్రెస్‌తరఫున గగన్పంథా, సీపీఎన్(యూఎంఎల్) కేపీ ఓలీ, కొత్తగా ఏర్పడిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్ఎస్పీ) నుంచి ఖాట్మండు మాజీ మేయర్ బలేంద్ర షా ప్రధాని రేసులో ఉన్నారు.
నేపాల్‌లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని భారత్ ఆకాంక్షిస్తోంది. రెండు దేశాల మధ్య అభివృద్ధి భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నికలు కీలకమని భావిస్తోంది. దీంతో అక్కడ జరిగిన ఎన్నికలను క్షుణ్నంగా పరిశీలించింది.
నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన 77 మంది
గతేడాది సెప్టెంబర్ 8, 9 తేదీల్లో యువత తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు. ఆందోళన సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది చనిపోవడం సంచలంగా మారింది. రెండు రోజుల నిరసనల్లో మొత్తం 77 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనలతో ఓలీ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత సెప్టెంబర్ 12న పార్లమెంట్‌ను రద్దు చేసి మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీని ఆపద్ధర్మ ప్రధానిగా నియమించారు.
