ట్రెండ్ మారుతోంది. రోజు రోజుకు ఓటీటీ ప్రేక్షకులు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో పాటు ఫైబర్ నెట్వర్క్ వాళ్లు కూడా రకరకాల సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ విడుదల చేస్తున్నాయి. తాజాగా యాక్ట్ ఫైబర్ తన కస్టమర్లకు మరింత దగ్గరవ్వడం కోసం మూడు కొత్త ప్లాన్స్ ను తీసుకొచ్చింది.
రూ.799 ప్లాన్ తీసుకుంటే 15 0 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ పొందొచ్చు. 6 లేదా 12 నెలల ప్లాన్ వేసుకుంటే నెట్ ఫ్లిక్స్ ఫ్రీగా చూడొచ్చు. రూ.1049 పెట్టి ప్లాటినం ప్రోమో స్ట్రీమింగ్ ప్లాన్ తీసుకుంటే 250 ఎంబీపీఎస్ స్పీడ్ తో 6 నుంచి 12 ప్లాన్ తో ఫ్రీగా చూడొచ్చు. రూ.1349లో డైమండ్ స్ట్రీమింగ్ ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ వస్తుంది. ఈ ప్లాన్ 6 నెలల లేదా 12 నెలలకు ఫ్రీగా చూడొచ్చు.
