ఆ యాడ్‌లో చేయ‌వ‌ద్దు: స‌మంత‌పై నెటిజ‌న్ల ఆగ్రహం

ఆ యాడ్‌లో చేయ‌వ‌ద్దు: స‌మంత‌పై నెటిజ‌న్ల ఆగ్రహం

సినీ న‌టి సమంత చిన్నపిల్లలకు చాలా ఇష్టమైన కుర్ కురే ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్ లో నటించింది. ఈ యాడ్ టీవీ ఛానల్స్ లో పదే పదే ప్రసారమవుతోంది. అయితే ఈ యాడ్ పై నెటిజెన్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సమంతను ట్రోల్ చేస్తున్నారు. కుర్ కురేలో ప్లాస్టిక్ పదార్ధాలు కలవడంతో.. అవి చిన్న పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తాయనే న్యూస్ ఎప్పటి నుండో వినబడుతుంది. పిల్లల ఆరోగ్యానికి హానికరమైన ఇలాంటి ప్రొడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎలా వ్యవహరిస్తూ…తినమంటూ ఎలా చెబుతారని సమంత పై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుకోసం ఇలాంటి వాటికి సపోర్ట్ చేయవద్దంటూ ట్వీట్స్ చేస్తున్నారు.