నీ పెళ్లాం నీ ఇష్టం.. కానీ నువ్వు ఆటగాడివి.. పాండ్యాపై ఫ్యాన్స్ ఆగ్రహం

నీ పెళ్లాం నీ ఇష్టం.. కానీ నువ్వు ఆటగాడివి.. పాండ్యాపై ఫ్యాన్స్ ఆగ్రహం

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భార్య, నటి నటాషా స్టాంకోవిక్ వివాదంలో చిక్కుకుంది. సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ చేసిన బోల్డ్ ఫొటోలే అందుకు కారణం. 

భర్తతో కలిసి థాయ్‌లాండ్‌ టూర్ ఎంజాయ్ చేస్తున్న ఈ  అందాల భామ అభిమానులకు సెగలు పుట్టించేలా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది. వీటి చూస్తే.. కొత్తగా పెళ్లైన దంపతులు ముద్దు కోసం పాకులాడుతున్నట్లు ఉన్నాయి. హార్దిక్ నల్లటి చొక్కా ధరించి కనిపించగా, నటాసా సగం శరీరం మాత్రమే కవర్ అయ్యేలా చారల దుస్తులు ధరించి ఉంది. ఆ ఫోటోలకు "Je t'aime" క్యాప్షన్ జోడించింది. Je t'aime అంటే ఫ్రెంచ్‌లో 'ఐ లవ్ యు' అని అర్థం.

ALSO READ:బీఆర్ఎస్ బలపడుతుందనే భయంతోనే మోడీ వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్రు : హరీష్ రావు

ఆ ఫోటోలు చూసి అభిమానులు ఒకవైపు ఆనందపడుతున్నా.. మరోవైపు హార్దిక్‌ను, నటాషాను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. "హిందూ సంప్రదాయంలో భార్యాభర్తల బంధానికి ఓ విలువ ఉంది. ఒక అంతర్జాతీయ ఆటగాడిగా ఇలాంటి ఫోజులతో సమాజానికి ఏం చెప్పదలుచుకున్నావ్.." అని కామెంట్లు పెడుతున్నారు.

కాగా, ఈ దంపతలిద్దరూ ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు.