ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. విద్యా విధానంలో ఇంటర్ బోర్డు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సిలబస్ నుంచి పరీక్షల విధానం వరకు కీలక సంస్కరణలు చేపట్టింది. ఇప్పటివరకు ఉన్న గ్రూపులకు అదనంగా బోర్డు సరికొత్తగా అకౌంటెన్సీ, కామర్స్ , ఎకనామిక్స్ సబ్జెక్టులతో ACE గ్రూపును ప్రవేశ పెట్టింది.
సైన్స్ విద్యార్థులపై భారాన్ని తగ్గించేలా ప్రాక్టికల్ పరీక్షల విధానాన్ని బోర్డు రెండు భాగాలుగా విభజించింది. గతంలో కేవలం సెకండ్ ఇయర్ లోనే 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉండేవి. కానీ ఇకపై.. ఫస్ట్ ఇయర్ లో - 15 మార్కులు, సెకండ్ ఇయర్ లో - 15 మార్కులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
ఫైనల్ ఎగ్జామ్ లో మ్యాథ్స్ పేపర్ 75 మార్కులకు బదులుగా 60 మార్కులకే పరిమితం కానుంది. అంతేకాదు ఫైనల్ ఎగ్జామ్ లో 100 మార్కుల నుంచి 80 మార్కులకు తగ్గించాలని బోర్డు నిర్ణయించింది. మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా కేటాయిస్తారు.
►ALSO READ | విద్యార్థులకు అలర్ట్: ఇంటర్ లో కీలక మార్పులు..ఈ ఏడాది నుంచే అమలు
ఈ కొత్త విధానం భాషా సబ్జెక్టుల్లో కూడా అమల్లోకి రానుంది. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని, సృజనాత్మకతను పెంచడమే పరమావధిగా ఈ మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. బట్టీ పద్ధతిని తగ్గించి, ప్రయోగాత్మక నైపుణ్యాలకు పెద్దపీట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది బోర్డు.
