కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, కీలక పత్రాలు కోర్టు కు సమర్పణ

 కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, కీలక పత్రాలు కోర్టు కు సమర్పణ

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో లింకుల కేసులో NIA దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న అరెస్ట్ చేసిన బోధన్ కు చెందిన సమీర్, ఆదిలాబాద్ కు చెందిన ఫిరోజ్, జగిత్యాలకు చెందిన ఇర్ఫాన్ అహ్మద్, నెల్లూరు బుజ్జిరెడ్డిపాళ్యంకు చెందిన ఇళియాస్ ను నాంపల్లి NIA కోర్టులో హాజరుపరిచారు. తనిఖీల సమయంలో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు NIA అధికారులు. 

నిన్న నోటీసులు ఇచ్చినవారిలో ఇవాళ 9 మంది విచారణకు హాజరయ్యారు. PFIకి సంబంధించిన లావాదేవీలపై వారిని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. PFI సంస్థలో శిక్షణ పేరుతో ఉగ్రలింకులు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నట్టు సమాచారం. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా... నిషేధిత సిమీ సంస్థకు అనుబంధంగా పనిచేస్తోంది. ఈ సంస్థకు చెందిన ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలు, హార్డ్ డిస్క్, లాప్ టాప్ లు పరిశీలిస్తున్నారు NIA అధికారులు.