నిమ్స్​లో మరో వెయ్యి బెడ్లు : ఈటల

నిమ్స్​లో మరో వెయ్యి బెడ్లు : ఈటల

హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు కావాల్సిన నిధులు కేటాయిస్తామని, మరో వెయ్యి పడకలను పెంచే విధంగా చర్యలు చేపడతామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. టీఆర్ ఎస్ ప్రభుత్వంతో రాష్ట్రంలోని సర్కారు దవాఖానాలన్నీ మెరుగుపడ్డాయని, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేం దుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు  కేసీఆర్ తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టారన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నిమ్స్ హాస్పి టల్​ను ఈటల సందర్శించారు. ఆస్పత్రి డైరెక్టర్ మనోహర్ , ఇతర సిబ్బందితో కలసి దాదాపు రెండు గంటల పాటు అన్ని విభాగాలను పరిశీలించారు.

దశాబ్దాలుగా నిమ్స్​ ఆస్పత్రి లక్షలాది మంది ప్రజలకు అత్యున్నత వైద్యం అందించిందన్నారు. గతంతో పోల్చితే నిమ్స్ కు వచ్చే రోగుల సంఖ్య రెట్టింపైందని, అందుకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడం సమస్యగా మారిందని చెప్పారు. అయినా సమర్థవంతంగా వైద్య సేవలు అందిస్తుండటం సాధారణ విషయం కాదని, సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.