అతి తెలివి ప్రదర్శించొద్దు: నిర్భయ దోషి పవన్ గుప్తా పిటిషన్ ను డిస్మిస్ చేసిన కోర్ట్

అతి తెలివి ప్రదర్శించొద్దు: నిర్భయ దోషి పవన్ గుప్తా పిటిషన్ ను డిస్మిస్ చేసిన కోర్ట్

నిర్భయ దోషి పవన్ గుప్తా తాను మైనర్ నని, ఉరిశిక్ష నుంచి తప్పించాలని కోరుతూ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ ను కోర్ట్ డిస్మిస్ చేసింది.

మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాల్ని, వ్యవస్థల్ని మారాల్సిన అవసరం ఉందని, లేదంటే జువైనల్ యాక్ట్ ప్రకారం శిక్ష పడే లోపు  తాము మైనర్ అని నిరూపించుకునే అవకాశం ఉంది. ఇప్పుడా యాక్ట్ లోని లూపోల్స్ ను అడ్డం పెట్టుకొనిబ ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషి పవన్ గుప్తా అతి తెలివిని ప్రదర్శిస్తున్నాడు.

నిర్భయ దోషుల్ని త్వరలో ఉరితీస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు ఒక్కొక్కరుగా ప్రయత్నిస్తున్నారు.

మొన్నటికి మొన్న దోషి అక్షయ్ సింగ్ ఓ వింత పిటిషన్ వేశాడు. ఎలాగో చస్తున్నాం..మళ్లీ ఉరిశిక్ష ఎందుకు..? అంటూ వేదాంతాలు వల్లివేస్తూ పిటిషన్ దాఖలు చేశాడు.

తాజాగా మరో దోషి పవన్ గుప్తా తాను నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగే సమయానికి తాను మైనర్ నని, ఉరిశిక్ష నుంచి తనని తప్పించాలని కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్ట్  జనవరి 24కి వాయిదా వేసింది. దీంతో కోర్ట్ వాయిదా వేయడంపై పవన్ గుప్తా లాయర్ కోర్ట్ లో హంగామా సృష్టించాడు. కేసు విచారణలో  ఆలస్యం చేస్తే తనకు న్యాయ వ్యవస్థమీద నమ్మకం పోతుందన్నాడు. ఇప్పటికే తన క్లయింట్ ఏడేళ్లు జైలుశిక్షను అనుభవించినట్లు, ఇప్పుడే తమకు న్యాయం చేయాలని మళ్లీ రివ్యూ పిటిషన్ వేశాడు. దీంతో దిగొచ్చిన ఢిల్లీ హైకోర్ట్ వాయిదా ఆర్డర్ ను రికాల్ చేసి విచారణ చేపట్టింది.

విచారణలో పవన్ గుప్తా వేసిన పిటిషన్ ను హైకోర్ట్ డిస్మిస్ చేసింది. చట్టంలోని  లొసుగుల్ని అడ్డం పెటుకొని కోర్ట్ సమయాన్నివృదా చేస్తూ దోషుల్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ పవన్ లాయర్ ఏకే సింగ్ కు 25వేల రూపాయల జరిమానా విధించింది.  ఏకే సింగ్ పై చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ కు ఆదేశాలు జారీ చేసింది.

నిర్భయ కేసు పరిణామాలు చూస్తుంటే నిర్భయ దోషులు, దోషులు తరుపున వాదించే లాయర్లు సైతం వీలైనంత వరకు ఉరిశిక్ష పడకుండా డిలే చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

జనవరి 7న దోషుల ఉరిశిక్షపై వేసిన డెత్ వారెంట్లపై  పాటియాలా హౌస్ కోర్ట్ విచారించనుంది. ఆ విచారణకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడం, ఆ తరువాత క్షమాభిక్ష కోరుతూ ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ను కోరనున్నట్లు సమాచారం.