నిత్యానంద ‘కైలాస’కు వీసాలు.. ఆస్ట్రేలియా నుంచి ఫ్లయిట్స్!

నిత్యానంద ‘కైలాస’కు వీసాలు.. ఆస్ట్రేలియా నుంచి ఫ్లయిట్స్!

వివాదాస్పద స్వామీజీ నిత్యానంద పరారీలో ఉన్నాడు. తనను తాను దేవుడిగా పిలుచుకునే నిత్యానంద.. కైలాస అనే హిందూ దేశాన్ని ఏర్పాటు చేశాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. విదేశాల్లో ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసిన నిత్యానంద.. దానికి సంబంధించి ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ దేశానికి నిత్యానందే ప్రధాని అని కూడా తెలుస్తోంది. తాజాగా నిత్యానంద ‘కైలాస’ గురించి మరికొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ కైలాస ఎక్కడ ఉందనే లొకేషన్ మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆస్ట్రేలియాకు దరిదాపులో ఉండొచ్చునని అనుమానిస్తున్నారు. ప్రత్యేక స్థానం అనేది లేని ఈ దేశాన్ని పర్యటించే వారి కోసం వీసాలను జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేక ఈ-మెయిల్ ఐడీని క్రియేట్ చేశారు. ఆ మెయిల్ ద్వారా విజిటర్స్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ దేశాన్ని పర్యటించే విజిటర్లు కేవలం మూడ్రోజులే ఇక్కడ ఉండేందుకు అనుమతిస్తారని సమాచారం. ఈ మేరకు కైలాస.ఓఆర్జీలో కొన్ని వివరాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి కైలాసకు విమానాలు నడుపనున్నట్లు తెలుస్తోంది. తమ సొంత దేశాల్లో హిందూజంను పాటించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు నిత్యానందతో కలసి కైలాసను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.