నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా.. క్షమాపణలు కోరుతున్నా : నితీష్ కుమార్

నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా.. క్షమాపణలు కోరుతున్నా : నితీష్ కుమార్

జనాభా నియంత్రణపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు.  తన మాటలు వల్ల ఎవరైనా బాధపడి ఉంటే  క్షమాపణలు  కోరుతున్నానని అన్నారు. తన  కామెంట్స్ ను వెనక్కి తీసుకుంటున్నట్లుగా నితీష్  వెల్లడించారు.  2023 నవంబర్ 7న రాష్ట్ర సభలో నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.  ఈ క్రమంలో నితీష్ క్షమాపణలు చెప్పాలంటూ  ప్రతిపక్షాలు డిమాండ్  చేశాయి.  ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా నితీష్ కుమార్ క్షమాపణలు కోరారు.  

ఇంతకీ నితీష్ కుమార్ ఏం అన్నారంటే..  జనాభా నియంత్రణలో మహిళల పాత్రను వివరించేందుకు సీఎం నితీశ్ కుమార్ ఉపయోగించిన పదాలు వివాదాస్పదంగా మారాయి.  గతంలో 4.3 శాతం సంతానోత్పత్తి రేటు ఇప్పుడు 2.9 శాతానికి పడిపోయింది. లైంగిక విద్య  గురించి ఈ తరం అమ్మాయిలకు అవగాహన పెరిగింది. ఏ టైంలో ఏం చేయాలో వారి బాగా తెలుసు. అందుకే జనాభా తగ్గుతోంది అని నితీష్ అన్నారు.  దీంతో అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.