నిజామాబాద్ జిల్లా నందిపేట్ ఎస్సై శోభన్ బాబుకు ఎంపీ అరవింద్ వార్నింగ్ ఇచ్చారు. అర్ధ రాత్రి బీజేపీ కార్యకర్తల ఇంటికి వెళ్లి ఎందుకు ఇబ్బందికి గురిచేస్తున్నారన్నారు. ఓ బీజేపీ కార్యకర్త ఇంటికి అర్థ రాత్రి పోలీసులు ఎందుకు వెళ్లారో చెప్పాలని ఎస్సై ని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి పోలీసులు అనుచరులుగా పని చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది కి గురిచేస్తే ఊరుకునేది లేదని ఎస్సై ని హెచ్చరించారు.
