నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో.. వరుస రౌండ్లలో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తున్నారు. రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న, మూడో ప్లేస్ లో ప్రొఫెసర్ కోదండరాం కొనసాగుతున్నారు. నాలుగు, ఐదో ప్లేస్ లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ కొనసాగుతున్నారు.
మొత్తం ఏడు రౌండ్లలో కౌంటింగ్ జరగాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. 5 రౌండ్లు ముగిసేసరికి పల్లా రాజేశ్వరరెడ్డికి 79వేల 113 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 60వేల 564ఓట్లు వచ్చాయి. టీజేఎస్ అభ్యర్థి కోదండరాంకు 49వేల 2వందల ఓట్లొచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 28వేల 991 ఓట్లు సాధించారు. 5 రౌండ్లలో మొత్తం 2లక్షల 79 వేల 970 ఓట్లను కౌంటింగ్ చేశారు. మొత్తం 15వేల 533 ఓట్లు చెల్లకుండా పోయాయి.
