తెలంగాణలో బర్డ్ ఫ్లూ వైరస్ లేదు: ఈటల

తెలంగాణలో బర్డ్ ఫ్లూ వైరస్ లేదు: ఈటల

రాష్ట్రంలో ఎక్కడా బర్డ్‌ ఫ్లూ వైరస్ లేద‌ని, దీనిపై వ‌స్తున్న వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌న్నారు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్. నిమ్స్‌లో ఆధునీకరించిన అంకాలజీ డిపార్ట్‌మెంట్‌ను ఇవాళ(శనివారం) ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, బ‌ర్డ్ ఫ్లూ పై అలర్ట్ గా ఉన్నామ‌ని… ఎవ‌రు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. వైద్యరంగంపై రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తున్నామ‌న్నారు. రూ.450కోట్లతో నిమ్స్‌లో సకల సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. వైద్యరంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

రాష్ట్రంలో రెండోదశ వ్యాక్సిన్‌ డ్రైరన్‌ విజయవంతం అయ్యిందని తెలిపారు మంత్రి ఈటల. కేంద్రం ఎప్పుడు వ్యాక్సిన్‌ పంపినా వాక్సినేషన్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రోజుకు 10లక్షలు మందికి వాక్సిన్‌ ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వాక్సినేషన్‌ కార్యక్రమం రెండు ఆస్పత్రుల్లో ఉంటుందన్న ఈటల..మొదటి వ్యాక్సిన్‌  తానే వేయించుకుంటానని తెలిపారు. కొత్త స్ట్రెయిన్‌కు భయపడాల్సిన పనిలేదన్నారు.