చిదంబరం బాగానే ఉన్నారు.. హాస్పిటల్​కు ​ఎందుకు?

చిదంబరం బాగానే ఉన్నారు.. హాస్పిటల్​కు ​ఎందుకు?
  • సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
  • ఢిల్లీ కోర్టుకు ఎయిమ్స్ రిపోర్టు
  • మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత

న్యూ ఢిల్లీ: ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మధ్యంతర బెయిల్ పిటిషన్​ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. చిదంబరం హెల్త్ కండిషన్ ను పరిశీలించాలన్న కోర్టు ఆదేశాలపై ఏర్పాటైన ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఇచ్చిన రిపోర్టును.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చదివి వినిపించారు. ఆ రిపోర్టు ప్రకారం చిదంబరం ఆరోగ్యంగానే ఉన్నారని, హాస్పిటల్ కు తీసుకెళ్లాల్సిన, బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు జడ్జి జస్టిస్ సురేశ్ కైత్​.. చిదంబరానికి ఇంట్లో వండిన ఫుడ్, మినరల్ వాటర్, దోమ తెరలు అందించాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా మెడికల్ చెకప్ లు చేయించాలని జైలు సూపరింటెండెంట్​కు ఉత్తర్వులిచ్చారు.  చిదంబరం అడ్వకేట్​  కపిల్ సిబల్ దీనికి అంగీకరించడంతో జడ్జి మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కొట్టివేశారు.

No need for Chidambaram to stay in hospital, HC told