బిహార్ ఎన్నికల ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. బిహార్ ఎన్నికల రిజల్ట్ చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. ఇది ముందు ఊహించిందే.. మహారాష్ట్ర ఫలితాల పాటర్న్ ఇది..గెలుస్తారు అనుకున్నోళ్లు ఓడిపోయారు. ఓడుతారనుకున్నోళ్లు గెలిచారు..ఇదంతా బీజేపీ, ఎలక్షన్ కమిషన్ కలిసి చేసిన కుట్ర అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
నవంబర్ 14న ప్రకటించిన బిహార్ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. 243 స్థానాలకు గానూ ఎన్డేయే కూటమి 200 కు పైగా సీట్లను గెలిచింది.. మహాఘట్భంధన్ కూటమి కేవలం 30 స్థానాలకే పరిమితం అయింది. ఇది కూటమికి పెద్ద దెబ్బ.
బిహార్ ఎన్నికల ఫలితాలపై ట్వీట్ చేస్తూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా మహారాష్ట్ర మోడల్.. అధికారంలోకి ఖచ్చితంగా వస్తారనుకున్న 50 మంది అభ్యర్థులు ఓడిపోయారని రౌత్ ఆరోపించారు.
గతేడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికలో కూడా ఓట్ల చోరీ జరిగిందని.. ఓటర్ల లిస్టులో మోసం, అవకతవకలు జరిగాయి ఇది ఎన్డీయేకు అధికారాన్ని కట్టబెట్టాయని శివసేన, కాంగ్రెస్ ఆరోపించాయి. ఫలితంగా ఎన్డీయే కూటమి , మహాయుతి ఎన్నికల్లో విజయం సాధించి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బాటలు వేశారని విమర్శించాయి.
