ఢిల్లీలోని యమునా నది వద్ద ఛత్ పూజ కోసం ఘాట్ లు ఏర్పాట్లు చేశారు. అయితే ఎన్జీటీ ఆదేశాల ప్రకారం.. నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి అనుమతి లేదు. అలాగే ఎలాంటి నైవేద్యాలు సమర్పించవద్దని పేర్కొంది. నది వెంబడి ఛత్ పూజ కోసం 1,100 ప్రదేశాలు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు...ఢిల్లీని నీటి కాలుష్యం కూడా వెంటాడుతోంది. ఢిల్లీలోని యమునా నది కాలుష్యంతో నిండిపోయింది. విషపు వ్యర్ధాలు నీటిలో నిండిపోయాయి. విషపు నురుగలు ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయి. ప్రమాదకరస్థాయిలో కాలుష్య కారకాలు ప్రవహిస్తున్నాయి.
దీంతో ఢిల్లీ వాటర్ బోర్డ్ నదిలో విషపూరిత నురుగను తొలగించేందుకు కెమికల్స్ స్ప్రె చేసింది. అయితే ఆదివారం నుంచి ఛత్ పండుగ ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు ఛత్ పండుగను జరుపుకుంటారు. వేలాది మంది భక్తులు నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అయితే యమునా నదిలో నీరు కలుషితమైంది. పారిశ్రమిక వ్యర్థాలు నదిలో కలవడం, డిటర్జెంట్ల వల్ల నీరు కలుషితమైనట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. అయినప్పటికి భక్తులు కాలుష్యమైన నీటిలోనే స్నానాలు ఆచరించారన్నారు.
