నవంబర్‌లో నో షేవ్ ఛాలెంజ్

నవంబర్‌లో నో షేవ్ ఛాలెంజ్

నవంబర్​ నెల మొదలైందంటే చాలు  చాలామంది అబ్బాయిలు గెడ్డం, మీసాలు గీసుకోవడం మానేస్తారు. ఈ నెలంతా ట్రిమ్మర్​, రేజర్​ ముట్టుకోరు. ఇదంతా ‘నో షేవ్​ నవంబర్​’ ఛాలెంజ్​. ఈ ఛాలెంజ్​ వెనక  కారణం... ప్రొస్టేట్, టెస్టిక్యులర్​ క్యాన్సర్ల​ మీద అవేర్​నెస్ పెంచడం. ఆ క్యాన్సర్ల​ని తగ్గించడం, ఈ క్యాన్సర్ల బారిన పడిన​ రోగుల్ని కాపాడడం. ఆ నెలంతా గెడ్డం గీసుకోకుండా మిగిల్చిన మొత్తాన్ని క్యాన్సర్​ పేషెంట్లకి ఇస్తారు. ఈ​ ఛాలెంజ్​ తీసుకున్నవాళ్లు గెడ్డం స్టయిల్​గా, నీట్​గా పెరగడానికి ఏం చేయాలంటే...  

గెడ్డం స్టయిల్​గా, పెద్దగా రావాలంటే రెగ్యులర్​గా బియర్డ్ ఆయిల్ రాసుకోవాలి. విటమిన్లు, అలోవెరా ఉన్న ఆయిల్​ వాడితే గడ్డం మెరుస్తూ కనిపిస్తుంది. అలాగే కెమికల్స్​ తక్కువ ఉన్న షాంపూ, కండీషనర్​ మర్చిపోవద్దు. గెడ్డాన్ని రోజూ దువ్వుకోవాలి. అందుకోసం గుండ్రని, మెత్తని పళ్లు ఉన్న దువ్వెన వాడాలి. దీంతో గడ్డం అంతటా  ఒకేలా, నీట్​గా పెరుగుతుంది. అంతేకాదు గెడ్డాన్ని ఆరబెట్టేందుకు కూడా ఈ దువ్వెన పనికొస్తుంది. అనుకున్న స్టయిల్​లో గెడ్డం పెరగాలంటే క్వాలిటీ బియర్డ్ క్రీమ్​ రాసుకోవడం తప్పనిసరి. బియర్డ్​ బామ్​ వాడినా లుక్​ బాగుంటుంది. అయితే పెట్రోలియం జెల్లీ వంటివి ఉన్న బియర్డ్​ బామ్​ వాడొద్దు.

మీడియం హీట్​ చేసిన బ్లో డ్రైయర్​తో గెడ్డాన్ని నచ్చిన ఆకారంలో స్టయిల్​గా  చేసుకోవచ్చు. అయితే బ్లో డ్రైయర్​ వాడేటప్పుడు మాత్రం జాగ్రత్త. ఎందుకంటే డ్రైయర్​ హీట్​ ఎక్కువ అయితే గెడ్డం లుక్​  పాడయ్యే ఛాన్స్​ కూడా ఉంది.   పోషకాలున్న ఫుడ్ తింటే గెడ్డం కూడా బాగా పెరుగుతుంది. అందుకు విటమిన్లు ఎక్కువగా ఉన్న ఫుడ్​ తినాలి.