జూన్ 15లోగా స్కూళ్లకు నోట్ బుక్స్ చేరాలె : స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్

జూన్ 15లోగా స్కూళ్లకు నోట్ బుక్స్ చేరాలె : స్కూల్ ఎడ్యుకేషన్  డైరెక్టర్ నవీన్ నికోలస్
  • స్కూల్ ఎడ్యుకేషన్  డైరెక్టర్ నవీన్ నికోలస్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని సర్కార్‌‌‌‌ స్కూళ్లకు ఈనెల 15లోగా  నోట్‌‌బుక్స్‌‌ చేరాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. ఈ మేరకు డీఈఓలకు, ఎంఈఓలకు ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే  మండల కేంద్రాలకు నోట్‌‌బుక్స్‌‌ చేరాయని, అక్కడినుంచి స్కూళ్లకు చేరవేయడంలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. మండల పాయింట్ల నుంచి స్కూళ్లకు తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చులను  ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందని గుర్తుచేశారు. సప్లై ప్రక్రియను ఎంఈఓలు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, డీఈఓలు రోజువారీ పురోగతిని ట్రాక్ చేయాలని ఆదేశించారు. 

ఒకటి, రెండు తరగతులకు మూడు నోటు బుక్స్‌‌, మూడు నుంచి ఐదో తరగతి వరకూ విద్యార్థులకు నాలుగు, 6, 7 తరగతులకు ఆరు, 8వ తరగతికి ఏడు, 9, 10 తరగతులకు 14, ఇంటర్ విద్యార్థులకు 12 బుక్స్ ఇవ్వనున్నట్టు చెప్పారు. స్కూళ్లకు చేరిన నోట్‌‌బుక్స్‌‌ విషయంలో హెడ్ మాస్టర్లదే పూర్తి బాధ్యత అని ఆయన స్పష్టంచేశారు.