5204 స్టాఫ్ న‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

5204 స్టాఫ్ న‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

స్టాఫ్ నర్స్ పోస్టులకు తెలంగాణ మెడికల్ హెల్త్ కేర్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5వేల 204 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. డీఎంఈ, డీహెచ్ ప‌రిధిలో 3,823 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వైద్య విధాన ప‌రిష‌త్‌లో 757 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హులైన అభ్యర్థులు జ‌న‌వ‌రి 25 నుంచి ఫిబ్రవ‌రి 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలని అధికారులు తెలిపారు. 

సీఎం కేసీఆర్ హామీ మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. మొత్తం 7వేల 320 పోస్టులకు రిక్రూట్మెంట్ చేపట్టగా.. ఇప్పటికే 969మందిని తీసుకోవడం జరిగిందన్నారు. కొత్తగా 5వేల 204 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని.. త్వరలోనే స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని ట్వీట్ చేశారు.