అత్యవసర వినియోగంగా నోవావాక్స్‌కు డీసీజీఐ అనుమతి

అత్యవసర వినియోగంగా నోవావాక్స్‌కు డీసీజీఐ అనుమతి

2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సున్న పిల్లల కోసం బయో టెక్నాలజీ కంపెనీ నోవావాక్స్ కోవిడ్ టీకాను తీసుకొచ్చింది. కౌమారదశలో ఉన్న వారి పిల్లల కోసం ఈ వ్యాక్సిన్ అత్యవసర టీకాగా వినియోగించవచ్చని ప్రకటించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఇప్పుడు దేశంలోని 12 నుండి 17 సంవత్సరాల వయస్సు గల వారి కోసం నోవా వాక్స్ ఎమర్జెన్సీ యుసేజ్‌కు అనుమతి ఇచ్చింది. నోవావాక్స్ కోవిడ్ వ్యాక్సిన్ భారతదేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)చే Covovax బ్రాండ్ పేరుతో అభివృద్ధి చేయబడింది.

నోవావాక్స్ కోవిడ్ టీకా 90 శాతం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న‌ట్లు తేలింది. అన్ని ర‌కాల వేరియంట్ల‌పై త‌మ టీకా ప్ర‌భావవంతంగా ప‌నిచేస్తుంద‌ని ఆ కంపెనీ పేర్కొన్న‌ది. అమెరికా, మెక్సికోలో జ‌రిగిన భారీ స్థాయి అధ్య‌య‌నాల ద్వారా వెల్ల‌డైన‌ట్లు నోవావాక్స్ పేర్కొన్న‌ది. ప్రాథ‌మిక డేటా ఆధారంగా వ్యాక్సిన్ 90 శాతం స‌మ‌ర్థ‌వంత‌మైంద‌ని, సుర‌క్షితంగా కూడా ఉన్న‌ట్లు నోవావాక్స్ చెప్పింది. ఇది ప్రొటీన్ బేసెడ్ వ్యాక్సిన్ అని. 18 ఏళ్లు దాటిన సుమారు 30 వేల మందిపై నోవావాక్స్ టీకా ట్ర‌య‌ల్స్ జ‌రిగాయి. వీటిల్లో మూడ‌వ వంతు ప్ర‌జ‌లు మూడు వారాల వ్య‌వ‌ధిలో రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. యూకే వేరియంట్‌పై నోవావాక్స్ ప‌నిచేస్తుంద‌ని తేలింది. సాధార‌ణ ఫ్రిడ్జ్‌లో ఈ టీకాల‌ను నిల్వ చేయ‌వ‌చ్చు.