- ఎన్పీఆర్డీ జాతీయ మహాసభలో డిమాండ్
హైదరాబాద్, వెలుగు: దివ్యాంగులకు పింఛన్ పెంచాలని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మార్చి15న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్డీ) ప్రకటించింది. మూడ్రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ మహాసభలు బుధవారం ముగిశాయి.
ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. 2011లో పెరిగిన పింఛన్.. ఆ తర్వాత పెంచలేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా వెంటనే పెన్షన్ పెంచాలని ఎన్‌పీఆర్డీ జాతీయ నేతలు మురళీధరన్, గిరీశ్ కార్తీ, అడివయ్య కోరారు. 2019లో దివ్యాంగుల సమస్యలను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, ఆ తర్వాత మర్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

