మాదాపూర్, వెలుగు: మూడు రోజుల పాటు మాదాపూర్ శిల్పారామంలో నిర్వహించిన ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా ఆదివారం ముగిసింది. ఈ మేళాలో ఒడిశా కళలు, హస్తకళలు, హ్యాండ్లూమ్స్, సంప్రదాయ వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
30కిపైగా క్రాఫ్ట్ స్టాల్స్, 20 ఫుడ్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. ముగింపు కార్యక్రమంలో ఒడిస్సీ, సాంబల్పురి నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, ప్రిన్స్ డాన్స్ గ్రూప్ గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులను అలరించాయి.
