ఈ కుక్క ఓలా ఉద్యోగి.. ఇదిగో ఐడీ కార్డ్.

ఈ కుక్క ఓలా ఉద్యోగి.. ఇదిగో ఐడీ కార్డ్.

.

చాలామంది  కుక్కలను పెంచుకుంటారు.  అంతేకాదు.. వాటికి పుట్టిన రోజు వంటి వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు.  దానికి పట్టెడన్నం పెడితే చాలు...ప్రాణం పోయో వరకు విశ్వాసం కలిగి ఉంటుంది.  అందుకే దానిని గ్రామ సింహంగా గుర్తించారు.  ఎందులోనైనా సరే శిక్షణ ఇస్తే చాలు.. అది అందులో ఎంతో ప్రావీణ్యత కలిగి ఉంటుంది.  అందుకే దేశ భద్రత వ్యవస్థలో శునకానికి అత్యున్నత స్థానం కల్పించారు.  ఎంతోమంది నేరస్థులను పట్టుకోవడంలో  డాగ్స్ ప్రత్యేక పాత్న  పోషించిన సంఘటనలు అనేకం. 


ఒక కుక్క ఎలక్ట్రానిక్ రంగంలోనూ ఉద్యోగాన్ని సంపాదించింది. అది కూడా చిన్న చితక కంపెనీ కాదు… భారతీయ దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా.
ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో విడుదల చేసి అద్భుతమైన లాభాలను పొందింది. ఆ కుక్కకు ఓలా యాజమాన్యం   బిజిలీ అని పేరు పెట్టారు. గత కొన్ని రోజుల క్రితం బిజిలీ అనే కుక్కకి ఉద్యోగం కలిపిస్తూ ఐడి కార్డు ని కూడా అందించారు, అందులో 440v అనే ఎంప్లాయ్ ఐడీతో పాటుగా దాని అడ్రస్, బ్లడ్ గ్రూప్‌ని కూడా మెన్షన్ చేసారు. 

 తాజాగా ఎస్ 1 ఉత్పత్తిని నిలిపివేసిన ఓలా(OLA) ఎస్ 1 ఎయిర్ ఉత్పత్తికి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రొడక్షన్  ప్రారంభించింది ఓలా ఎస్ 1 ఎయిర్ లైమ్ గ్రీన్ స్కూటర్ పైన ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులంతా సంతకాలు చేసారు. కానీ  బిజిలి అనే కుక్క మాత్రం  స్కూటర్ సీటు పైన కూర్చుంది. దీనికి సంబంధించిన ఒక ఫోటోని ఆ సంస్థ సీఈవో తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది.