మీరు చాలా యంగ్‭గా ఉన్నరు.. సీజేఐపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు

మీరు చాలా యంగ్‭గా ఉన్నరు.. సీజేఐపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ యూత్ ఫుల్ లుక్‭లో ఉన్నారంటూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. బార్ కౌన్సిల్ సన్మాన కార్యక్రమంలో కిరణ్ రిజిజు హాస్యాస్పదంగా ఈ వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ చంద్రచూడ్‭ను ఉద్దేశించి మాట్లాడిన కిరణ్ రిజిజు.. చంద్రచూడ్ యవ్వన రూపం గురించి ఎవరూ వివాదం చేయరని అనుకుంటున్నాను అంటూ వ్యాఖ్యానించారు. 63 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎంతో యంగ్‭గా కనిపిస్తున్నారంటూ కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన చంద్రచూడ్.. తన వయస్సు గురించి గూగుల్ లో సెర్చ్ చేశానని చెప్పారు. తన వయస్సు 12 ఏళ్లని గుర్తించానని, తాను ఇంకా యువకుడినే అంటూ తన మాటలతో అక్కడున్నవారిని జస్టిస్ చంద్రచూడ్ నవ్వించారు. 

అంతటితో ఆగకుండా కిరణ్ రిజిజు మళ్లీ మాట్లాడుతూ.. తాను పుట్టిన తేదీ గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వనని చెప్పారు. తన పుట్టిన రోజు గురించి తాను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కాబట్టి రికార్డులో ఉన్నదే ఉండనివ్వండి అని చెప్పారు. అయితే.. న్యాయమూర్తి చంద్రచూడ్ ఫిట్ నెస్ తో తాను సవాల్ చేయనని మళ్లీ హాస్యాస్పదంగా మాట్లాడారు. దీనిపై మళ్లీ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో మీరు యవ్వనంగా కనిపిస్తున్నారని తనకు ఎంతోమంది చెప్పారని అన్నారు. ఈ విషయం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. బార్ కౌన్సిల్ సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన చివరిగా.. హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఇచ్చే పెద్ద తీర్పుల కంటే.. చిన్న చిన్న కేసులే తనకు శాంతి, ప్రశాంతనను కలిగిస్తాయని చెప్పారు.