మహబూబాబాద్, వెలుగు : వచ్చే మార్చి వరకు రాష్ట్రంలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాజ్యసభ సభ్యుడు, సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ లో జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఇస్తున్న ఉచిత ట్రైనింగ్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓకేసారి 560 గ్రూప్ 1 పోస్ట్ లను భర్తీ చేసినట్లు చెప్పారు.
కొంతమంది కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇక నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నట్లు తెలిపారు. మానుకోట జిల్లాకు త్వరలో స్కిల్స్ యూనివర్సిటీ వస్తుందన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్, మున్సిపల్ చైర్మన్ గుగులోతు జ్యోతి, కలెక్టర్స్నేహ శబరీశ్, ఎస్పీ శబరీష్, డీఎస్పీ తిరుపతిరావు పాల్గొన్నారు.
