మార్చి నుంచి విమెన్స్ క్రికెట్
న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీ ఫ్యూచర్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆదివారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లోనూ ఈ టోర్నీపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. కానీ మార్చి నెలలో విమెన్స్ క్రికెట్(డొమెస్టిక్, ఇంటర్నేషనల్)ను రీస్టార్ట్ చేసేందుకు బోర్డు రెడీగా ఉంది. కరోనా వల్ల నిలిచిపోయిన డొమెస్టిక్ క్రికెట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో ఇటీవల రీస్టార్ట్ అయ్యింది. రంజీ ట్రోఫీపై ఆదివారం జరిగే మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. ఈ టోర్నీపై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సానుకూలంగా ఉన్నప్పటికీ పలువురు మెంబర్స్ వ్యతిరేకిస్తున్నారని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ‘రంజీ ట్రోఫీ నిర్వహణకు ప్రెసిడెంట్ కట్టుబడి ఉన్నారు. కానీ కొందరు మెంబర్లు విజయ్ హజారే(వన్డే టోర్నీ) కోసం పట్టుబడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే అయినా రంజీ ట్రోఫీకి సంబంధించిన లాజిస్టిక్స్ ప్లాన్స్ రెడీ చేయాలని ఆపరేషన్స్ టీమ్‌ను ఆదేశించారు. రంజీ, విజయ్ హజారేలో ఏ టోర్నీ ఉంటుందో ఈ వీకెండ్‌లోగా తెలిసిపోతుంది. మరోపక్క మార్చిలో విమెన్స్ క్రికెట్ రీస్టార్ట్ అవుతుంది. శ్రీలంక, ఇంగ్లండ్‌తో ఇండియా సిరీస్‌లు ఆడే చాన్స్ ఉంది’ అని ఆ అధికారి చెప్పారు. కాగా, టీ20 వరల్డ్‌కప్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అంశంపై గవర్నమెంట్‌తో చర్చలు కొనసాగించాలని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి
జడ్చర్ల నుంచి జపాన్ వరకు..
అన్నార్థుల ఆకలి తీర్చే ఆలయం
రియల్ మార్కెట్‌కు.. మూఢాలు కలిసొస్తున్నయ్

