ప్రతిపక్షాల చేతిలో కేసీఆర్​కు గుణపాఠం తప్పదు

ప్రతిపక్షాల చేతిలో కేసీఆర్​కు గుణపాఠం తప్పదు

హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్షాల బలంతో సీఎం కేసీఆర్ గుణపాఠం నేర్చుకోక తప్పదని వేద పండితులు గర్రేపల్లి మహేశ్వర్ శర్మ చెప్పారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన ఉగాది పంచాంగ శ్రవణం చెప్పారు. ఈ ఏడాది ఆహార ధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదని తెలిపారు. ఈసారి వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ఆదాయం, ఖర్చు సమానంగా ఉంటుందన్నారు. వచ్చిన ఆదాయం కొందరి చేతుల్లోనే తిరుగుతుందన్నారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవుతారని, 2028 మే వరకు ఆయనకు తిరుగులేదని చెప్పారు.

ప్రధాని తీసుకున్న నిర్ణయాలను యావత్తు దేశం సమర్థిస్తుందన్నారు. కాగా, దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేస్తే విజయం సాధిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, విజయశాంతి, స్వామిగౌడ్, మంత్రి శ్రీనివాసులు, బంగారు శ్రుతి 
తదితరులు పాల్గొన్నారు.