OTT MOVIES..అక్క చావు రహస్యం

OTT MOVIES..అక్క చావు రహస్యం

టైటిల్​     :     కాలింగ్​ సహస్ర

డైరెక్షన్​​     :     ​అరుణ్​ విక్కిరాల
కాస్ట్​  ​    :    ​సుడిగాలి సుధీర్​, డాలీషా, స్పందన, శివ బాలాజీ, మనోహరన్​, రవితేజ 
లాంగ్వేజి     :     తెలుగు
ప్లాట్​ ఫాం     :    ​అమెజాన్​ ప్రైమ్​ వీడియో

అజయ్​ శ్రీ వాత్సవ (సుడిగాలి సుధీర్​) సైబర్​ సెక్యూరిటీ ఎక్స్​పర్ట్. హైదరాబాద్​లోని తన ఫ్రెండ్​ కంపెనీలో కొత్తగా ఉద్యోగంలో చేరతాడు. తన అక్క హత్య తాలూకు చేదు జ్ఞాపకాలు అతడిని వెంటాడుతుంటాయి. మరే అమ్మాయికీ తన అక్కలా అన్యాయం జరగకూడదని ‘రెస్క్యూ’ అనే అప్లికేషన్​ తయారుచేస్తాడు. ఒకరోజు అజయ్​ కొత్త సిమ్​ కార్డ్​ తీసుకుంటాడు. అది తన మొబైల్​ ఫోన్​లో వేసుకున్నప్పటి నుంచీ వరుస ఫోన్లు వస్తుంటాయి. 

ఆ ఫోన్​ కాల్స్​ చేసిన వాళ్లంతా సహస్ర గురించి ఆరా తీస్తుంటారు.  దాంతో అజయ్​ అయోమయానికి గురవుతాడు. అసలు సహస్ర ఎవరు? ఆమెకు ఏమైంది?  అజయ్​తో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? సారా పేరుతో అజయ్​కు లేఖలు రాస్తున్న అజ్ఞాత ప్రేమికురాలు, సహస్ర ఒకరేనా? 
 

అజయ్​ అక్క చావుకు, సహస్ర కనిపించకుండా పోవడానికి ఏమైనా లింక్​ ఉందా? ఈ మొత్తం కథకు, లూసిఫర్​ అనే డార్క్​ వెబ్​ సైట్​ క్రైమ్​ ముఠాకు సంబంధం ఉందా? ఇందులో శివ (శివ బాలాజీ )పాత్ర ప్రాముఖ్యత ఏంటి? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

యు ఆర్​ వాట్​ యు ఈట్​

టైటిల్​     :    యు ఆర్​ వాట్​ యు ఈట్​ - ఎ ట్విన్​ ఎక్స్​పరిమెంట్
డైరెక్షన్​​     :  లూయీ సిహోయోస్​
లాంగ్వేజి     :     ఇంగ్లిష్​
ప్లాట్​ ఫాం     :    నెట్​ఫ్లిక్స్​

ఈ డాక్యు సిరీస్​ కొత్త ఏడాదికి మంచి బిగినింగ్​ అని చెప్పొచ్చు. అది కూడా హెల్త్​ మొదటి ప్రయారిటీ అయి ఉంటే ‘యు ఆర్​ వాట్​ యు ఈట్’ను ఇంకాస్త ఎక్కువ ఇష్టపడే అవకాశం ఉంది. 
నాలుగు పార్ట్​ల ఈ సిరీస్​లో 22 కవల జంటలు పార్టిసిపేట్​ చేశాయి. వాళ్లు తినే ఆహారంలో మార్పులు చేసి వాళ్ల ఆరోగ్యం ఎలా ఉందనేది సైంటిఫిక్​గా గమనించారు. మొదటి ఎపిసోడ్​లో సోషల్​ ఎక్స్​పరిమెంట్​ అనే కాన్సెప్ట్​, పద్ధతుల గురించి ఎక్స్​ప్లెయిన్​ చేశారు. 

ఈ ఎక్స్​పరిమెంట్​లో పాల్గొన్న కవల జంటల బ్యాక్​గ్రౌండ్స్​ గురించి ఇంట్రడ్యూస్​ చేశారు. వాళ్లలో ఒక జంటకు ప్లాంట్​ బేస్​డ్​ ఫుడ్​(శాఖాహారం) ఇస్తే మరొక జంటలకు ఓమ్నివోర్​ డైట్(శాఖాహారం, మాంసాహారం)​ ఇచ్చారు. వాళ్లు ఈ డైట్​ ప్లాన్​ను ఎనిమిది వారాలు ఫాలో అయ్యాయి. మొదటి వారం మాత్రం వాళ్లు ఏం తిన్నారో ఆ ఫుడ్​ వివరాలు రీసెర్చర్​లకు మెయిల్​ చేశారు. ఆ వివరాలతో పాటు  స్టాండర్డ్​ అమెరికన్​ డైట్​ అనేది వాడుకలోకి ఎలా వచ్చింది? తక్కువ ధరతో ఉండే ఫుడ్,​ ఎక్కువ కాలరీలు తినడం అనేది రోజూ తినే నార్మల్​ డైట్​గా ఎందుకు మారింది? వంటి వివరాలను ఈ ఎపిసోడ్​లో చూపించారు.
 

రెండో ఎపిసోడ్​లో ... డైట్​ ప్లాన్స్​ ఫాలో కావడానికి ఆ రెండు కవల జంటలు​ ఎంత కష్టపడుతున్నాయనేది చూపించారు. అలాగే ఆయా ప్రాంతాల వాతావరణ ప్రభావం అనేది ఆ ప్రాంతంలో నివసించే మనుషులు ఎంచుకునే ఆహారం మీద ఎంతవరకు పడుతుంది అనేది కూడా వివరించారు. ‘ఏం తింటున్నారనే కాదు. ఆ ఫుడ్​ ఎక్కడ నుంచి వస్తుందనేది కూడా తెలుసుకోవాలి’ అనే విషయం మీద ఈ డాక్యుసిరీస్​ గట్టిగా చెప్పింది. లైవ్​స్టాక్ నుంచి పౌల్ట్రీ, ఫిష్ ఫార్మింగ్​, ఇలా ప్రతి ఒక్క దాని గురించి చూపించారు. గ్లోబల్​ ట్రాన్స్​పోర్టేషన్​ ఇండస్ట్రీ కంటే లైవ్​స్టాక్​ వల్ల గ్రీన్​హౌస్​ గ్యాస్​ ఎక్కువ రిలీజ్​ అవుతుందనే విషయాన్ని ఎక్స్​పర్ట్స్​ మాట్లాడారు.
 

మూడో ఎపిసోడ్​లో.. వీగన్​ డైట్ చేస్తున్న కవలలు వాళ్ల ఫుడ్​ వాళ్లే వండుకుంటారు. చివరి ఎపిసోడ్​ ఆ డైట్​ వల్ల వచ్చిన రిజల్ట్​ మీద ఫోకస్​ చేసింది. స్పెసిఫిక్​ డైట్​ ప్లాన్ వల్ల ​ కొలెస్ట్రాల్​ రిస్క్​ నుంచి ప్రాణాలు తీసే వ్యాధుల వరకు ఎలాంటి ప్రభావం పడిందనే విషయం మీద ఫోకస్​ చేశారు. వీగన్​, ఓమ్నివోర్​ డైట్​ ప్లాన్​లలో ఏది బెటర్​ అని చెప్పడం కొసమెరుపు.
ఈ సిరీస్​లో ఎక్స్​పర్ట్స్​, న్యూట్రిషనిస్ట్​లు, చెఫ్​ డేనియల్​ హమ్​ కనిపిస్తారు. ఈ చెఫ్​ న్యూయార్క్​లోని ‘ఎలెవన్​ మాడిసన్​ పార్క్’ ఓనర్​.  ఇక్కడ ప్లాంట్​ బేస్​డ్​ మెను సర్వ్​ చేస్తున్నారు. డేనియల్​ 2018లో ‘ది గేమ్​ చేంజర్స్​’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్​  తీశాడు. ఈ సిరీస్​ అథ్లెట్స్​ అనుసరించే ప్లాంట్​ బేస్​డ్​ డైట్​ గురించి ఉంటుంది.
 

ఈ సిరీస్​లో ... మీరు తీసుకునే ఆహారం మీ పూర్తి ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చెప్తుంది. అంతేకాకుండా వాతావరణ మార్పులు, ఆ మార్పులు మనం తినే ఆహారంతో నేరుగా సంబంధాన్ని ఎలా కలిగి ఉన్నాయనే విషయాలు తెలుస్తాయి. ఈ డాక్యు సిరీస్​లో ‘చీజ్​ ట్విన్స్’​ అనే పార్ట్​ చూస్తుంటే మనమే అందులో ఉన్న ఫీల్​ కలుగుతుంది. దీన్ని మాత్రం అస్సలు మిస్​ కావద్దు. ఈ నాలుగు భాగాల డాక్యు సిరీస్​ను స్టాన్​ఫోర్డ్​ యూనివర్శిటీ విడుదల చేసిన ఒక రీసెర్చి స్టడీ ఆధారంగా తీశారు.