
భద్రాచలం పరిసరాల్లో ఉన్న అడవుల్లో 71 రకాల సీతాకోక చిలుకలు సంచరిస్తున్నట్లుగా గోపాలకృష్ణ అధ్యయనం ద్వారా తెలిసింది. రెక్కలు, స్పర్శకాలు, తల, తొండం, ఉదరం, కాళ్లు, ఉరం లాంటి భాగాలతో ఉండే సీతాకోక చిలుకలను వాటి జీవనశైలిని బట్టి నామకరణం చేశాడు ఆయన. ఇది శాస్త్రీయ పద్ధతిలో జరగడం విశేషం. ఒక్కో సీతాకోక చిలుక కొన్ని రకాల మొక్కలపై మాత్రమే జీవిం చ గలుగుతుందని గుర్తిం చాడు. లైమ్ బటర్ ్లై అనే సీతాకోక చిలుక మారేడు, గొలుగు, కరివేపాకు, బిల్లుడు, నిమ్మ, వెలగ చెట్లపై జీవిస్తుం ది. ఈ మొక్కలను సీతాకోకచిలుకల అతిథేయ మొక్కలుగా గుర్తిం చాడు. అంటే ఆ మొక్కలు సీతాకోక చిలుకలకు ఆతిథ్యం ఇస్తాయన్న మాట. కామన్ క్రో అనే సీతాకోక చిలుక మర్రి, రావి, పాలతీగ, పొగడ, ఎర్ర గన్నేరు, కలివి లాంటి చెట్లపై మనుగడ సాగిస్తుం ది.జీవవైవిధ్యానికి ముప్పు సీతాకోక చిలుకలు అంతరిస్తే జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతుందని ప్రకృతి
ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహార చక్రంలో భాగంగా సీతాకోక చిలుకలపై ఆధారపడే పక్షులు, సాలీళ్లు, తొండలు తగ్గే ప్రమాదం ఉంది. పువ్వుల ఫలదీకరణకు సీతాకోకచిలుకలు లేకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో సీతాకోక చిలుకలను పెంచేం దుకు కొన్ని చోట్ల ప్రత్యేక వనాలు ఏర్పడ్డా యి. అయితే, వీటిని పరిరక్షించేం దుకు చర్యలు తీసుకోవాల్సిన
అవసరం ఉంది.అటవీ ప్రాణులకువేట బెడదఉన్నట్లుగానే సీతాకోక చిలుకలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదం ఉంది. ఆన్‍లైన్‍లోనూ
వీటి విక్రయాలు సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోం ది. అంతర్జా తీయ స్థా యిలో ఏడాదికి 200 మిలియన్ డాలర్ల వ్యాపారం
సాగుతున్నట్టు అంచనా. క్రిమి కీటకాలను నాశనం చేసే రసాయనాలు సైతం సీతాకోక చిలుకలకు ప్రాణసంకటంగా మారాయి.
సంచారాన్ని బట్టి గుర్తించొచ్చు సీతాకోక చిలుకలు తిరిగే ప్రాంతాన్ని బట్టి అక్కడున్న పుష్ప, మొక్క, ఆకు, చెట్లను అంచనా వేయొచ్చు. బ్లూ మర్మోన్ సీతాకోక చిలుక తిరుగుతున్న ప్రాంతాన్ని బట్టి నిమ్మ జాతి, వెలగ,మారేడు మొక్కలు ఉన్నాయని
నిర్దా రిం చవచ్చు. క్రింసన్ రోజ్, కామన్ రోజ్, కామన్ మర్మోన్ లాంటి సీతాకోకలు కనిపించాయంటే ఆ ప్రాంతంలో నల్ల ఈశ్వరీ,
గాడిద గడపాకు తీగజాతులు ఉన్నాయని గుర్తిం చొచ్చు. కొన్ని జాతుల సీతాకోకలు అంతరిం చే స్థితికి వచ్చాయి. నెమలి ఆకుపచ్చ రంగులో మెరిసే కామన్ బాండెడ్ పికాక్ , కామన్ పికాక్ లాంటి సీతాకోక చిలుకలు పట్టణ ప్రాంతాల్లో కనిపించడం లేదు.
అందుకు కారణం బిల్లుడు చెట్లు లేకపోవడమే. అడవుల్లో కూడా ఈ జాతి మొక్కలు తగ్గితే ఈ అందమైన జీవి భవిష్యత్తులో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అశోక మొక్కలు లేక పోవడంతో పల్లెల్లో కామన్ జే రకం జాడ లేదు. మన దేశంలో 1501 జాతులు ప్రపంచ వ్యాప్తంగా 18 వేల సీతాకోకచిలుక జాతులు ఉండగా.. మన దేశంలోనే 1501 రకాలు ఉన్నాయని గోపాలకృష్ణ
చెబుతున్నా డు. అదే తెలుగు రాష్ట్రా ల్లో అయితే 170 రకాలు ఉన్నాయంటున్నాడు. తెలుగు భాషలో వీటి వ్యవహారిక నామాలు
అధికారికంగా లేవు.
అమెరికాలో ఉండే మోనార్క్ అనే సీతాకోక చిలుక మెక్సికోకు వలస వెళ్లినట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నా యంట. హిమాలయాల నుం చి మైదాన ప్రాంతాలకు, పడమటి కనుమల నుం చి తూర్పు కనుమల వరకు కాలానుగుణంగా కొన్ని రకాల సీతాకోక చిలుకలు రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కీటకంగా ఎందుకు ఉండకూడదు..?
‘రాష్ట్ర జంతువు, రాష్ట్ర పక్షి, రాష్ట్ర వృక్షం ఉన్నపుడు కీటకాల పక్షాన తెలంగాణ కీటకంగా సీతాకోక చిలుక ఎందుకు ఉండకూడదు..?’ అనేది గోపాలకృష్ణ ప్రశ్న. మహారాష్ట్ర ప్రభుత్వం 2015 లోనే దేశంలో అతిపెద్ద రెం డవ సీతాకోక చిలుక ‘బ్లూ మర్మోన్ ’ను తమ రాష్ట్ర కీటకంగా ప్రకటించిం దని ఆయన గుర్తు చేశాడు. ప్రస్తుతం కర్నాటక కూడా అదే బాటలో నడుస్తోంది. ఇటీవల రాష్ట్ర జీవవైవిధ్య మండలి కొన్ని అంతరిం చిపోతున్న వృక్ష జాతులను ప్రకటించిం ది. వాటిలో బిల్లుడు చెట్లు కూడా ఉన్నాయి. బిల్లుడు వృక్షాలపై పెరిగే నెమలి ఆకుపచ్చ రంగులో ఉండే ‘కామన్ బాండెడ్ పికాక్’ను తెలంగాణ రాష్ట్ర కీటకంగా ఎంపిక చేయాలని గోపాలకృష్ణ ప్రభుత్వానికి లేఖ కూడా రాశాడు. జి.గోపాలకృష్ణ.. భద్రాచలంలోని నన్నపనేని మోహన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర
ఉపాధ్యాయుడు. స్వగ్రామం వాజేడు మండలం జగన్నాథపురం. ఒక రోజు 8వ తరగతిలో ‘జీవ వైవిధ్య పరిరక్షణ’ అనే పాఠం చెబుతుండగా సీతాకోక చిలుకలను మనం ఎందుకు సంరక్షించాలి..? అనే ఆలోచన గోపాలకృష్ణకు వచ్చింది. ఆ ఆలోచనే ఆయనను పర్యావరణ, ప్రకృతి ప్రేమికుడిగా మార్చింది. తెలుగులో తొలి ‘మన సీతాకోక చిలుకలు’ పుస్తకావిష్కరణకు ప్రేరణగా
నిలిచిం ది. ‘రంగురంగుల చుక్కల చీర సింగారం చేసుకుని.. విహరిం చే నిను చూస్త ుంటే మదికెంతో స్వాంతన కలుగు.
ఏ అసురుడి దిష్టి దోషమో నీదు ఉసురు తీసెనా..జ్ఞా పకాల గోడల మీద ప్లా స్టిక్ బొమ్మవైతివా. విషపూరిత రసాయనాలు కసిరి కాటువేశాయా…? సీతాకోక చిలుకమ్మా ప్రకృతి వరప్రసాదమా…’ వెతికి వెతికి పరిశీలిం చి సీతాకోక చిలుకల జీవనశైలిపై జి.గోపాలకృష్ణ చేసిన పరిశోధన సారాం శం ఈ పదాల్లో ‘మనసీతాకోక చిలుకలు’ అనే పుస్తకాన్ని శాస్త్రీయ
సమాచారంతో రూపొందిం చడం విశేషం. రాష్ట్ర వ్యాపంగా ఉన్న అడవుల్లో కనిపించే సీతాకోక చిలుకలపై అధ్యయనం చేశాడు గోపాలకృష్ణ. వాటి ఫొటోలు సేకరించి ‘మన సీతాకోక చిలుకలు’ పుస్తకాన్ని రూపొందించాడు. అంతరించి పోతున్న సీతాకోకచిలుకల వివరాలు, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర? మానవాళికి కలిగే ఉపయోగాలను తన పుస్తకంలో పొందుపరిచాడు.
