రైతులకు మెరుగైన సేవలు అందించాలి .. రైతుల అభ్యున్నతే సహకార బ్యాంకుల ప్రగతికి పునాది

రైతులకు మెరుగైన సేవలు అందించాలి  ..  రైతుల అభ్యున్నతే సహకార బ్యాంకుల ప్రగతికి పునాది

కల్లూరు, వెలుగు: రైతుల అభ్యున్నతే సహకార బ్యాంకుల ప్రగతికి పునాది అని వ్యవసాయం శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా కల్లూరులో డీసీసీబీ బ్రాంచ్ కొత్త భవనాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌‌‌‌‌‌‌‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు మరింత చేరువలో, సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలు అందించాలనే ఉద్దేశంతో కల్లూరులో కొత్త భవనంలో డీసీసీబీ శాఖను ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీవో గంగాధర్, ఏసీపీ వసుంధర యాదవ్, బ్యాంక్ సీఈవో ఎన్.వెంకట ఆదిత్య, డీజీఎం ఎం.సర్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.