ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మాచర్ల పట్టణంలో పెద్ది సినిమా ఆడుతున్న రామా టాకీస్ లో మంటలు చెలరేగాయి. సోమవారం ( జూన్ 8 ) అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో థియేటర్ దగ్దమయ్యింది. ఈ థియేటర్ లో ఇటీవలే విడుదలైన రామ్ చరణ్ పెద్ది సినిమా ఆడుతుండడం గమనార్హం.
క్షణాల్లో మంటలు వ్యాపించడంతో థియేటర్ మొత్తం దగ్దమయ్యింది. ఘటన జరిగిన సమయంలో దట్టమైన కమ్ముకుంది. ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. షో అయిపోయాక ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ ఘటనలో సుమారు రూ.70 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండచ్చని అంచనా వేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా ఆడుతున్న థియేటర్ తగలబడటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
