టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 13వ ప్లేస్
దుబాయ్: బ్రిస్బేన్ టెస్ట్‌లో అదిరిపోయే బ్యాటింగ్‌తో ఇండియాను గెలిపించిన రిషబ్ పంత్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. టెస్ట్ బ్యాట్స్‌మెన్ లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో పంత్ కెరీర్ బెస్ట్ 13వ ర్యాంక్ సాధించాడు. దీంతో ర్యాంక్ పరంగా ప్రస్తుతం వరల్డ్‌లోనే బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. పంత్ తర్వాత క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా) 15వ ర్యాంక్‌లో ఉన్నాడు. బ్రిస్బేన్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ .. థర్డ్ ర్యాంక్ సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కు నెట్టాడు. ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో చివరి మూడు టెస్ట్‌లకు కోహ్లీ దూరంగా ఉండటం లబుషేన్‌కు కలిసొచ్చింది. ఇక, ఇండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 68వ ర్యాంక్ నుంచి 47కు చేరాడు. టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఓ స్థానం మెరుగుపర్చుకొని ఏడో ర్యాంక్ సాధించాడు. ఓవరాల్‌గా కోహ్లీ(4), పుజారా(7), రహానె(9) ఇండియా నుంచి టాప్–10లో ఉన్నారు. బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 32 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌లో నిలిచాడు. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ నంబర్‌వన్ ప్లేస్‌లో ఉండగా ఇండియా నుంచి రవిచంద్రన్ అశ్విన్(8), జస్ప్రీత్ బుమ్రా(9) టాప్–10లో ఉన్నారు.
For More News..