Pathaan: కేజీఎఫ్ 2 కలెక్షన్లను క్రాస్ చేయనున్న పఠాన్

Pathaan: కేజీఎఫ్ 2 కలెక్షన్లను క్రాస్ చేయనున్న పఠాన్

బాక్సాఫీస్ వద్ద షారూఖ్ ఖాన్ పఠాన్ ప్రభంజనం ఆగడం లేదు. విడుదలై రెండు వారాలు దాటినా వసూళ్లు తగ్గడం లేదు. నిన్న(సోమవారం) 13వ రోజు కూడా ఇండియాలో 8.25 కోట్ల  గ్రాస్ వచ్చింది. దీంతో హిందీలో మొత్తం రూ. 422 కోట్లు వచ్చాయి.  తెలుగు, తమిళంలో 15.70 కోట్లు వసూలు చేసింది.  మొత్తం  ఇండియాలో  13 రోజుల్లో రూ.438.45 కోట్లు వసూలు చేసింది. కేజీఎఫ్ 2 హిందీ క్లోజింగ్ కలెక్షన్లను దాటేయనుంది. 

జనవరి 25న విడుదల పఠాన్ మొదటిరోజే రూ.57 కోట్లు వసూలు చేసి, భారతీయ సినిమా రికార్డులన్నీ బద్దలుకొట్టింది. రెండో రోజు రూ.70కోట్లకు పైగా బిజినెస్ చేసిన చిత్రంగానూ పఠాన్ నిలిచింది. ఇలా వారంతంలోనే, కేవలం 6రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ ను దాటింది. అంతే కాదు వరల్డ్ వైడ్ గానూ రూ. 850.42 కోట్లు వసూలు చేసింది. ఇండియన్ టాప్ 10 హయ్యెస్ట్ గ్రాస్ మూవీల్లో పఠాన్ 7 వ ప్లేసులో కొనసాగుతోంది.