అందెల శ్రీరాములు యాదవ్ కామెంట్స్ పై పటోళ్ల కార్తీక్ రెడ్డి కౌంటర్​

అందెల శ్రీరాములు యాదవ్ కామెంట్స్ పై పటోళ్ల కార్తీక్ రెడ్డి కౌంటర్​

ఎల్బీ నగర్, వెలుగు: మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెచ్చింది రూ.6 కోట్లే అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్​చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ చేసిన కామెంట్స్ పై మంత్రి సబితా రెడ్డి తనయుడు, జాతీయ మీడియా స్పోక్స్ పర్సన్ పటోళ్ల కార్తీక్ రెడ్డి కౌంటర్​ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి మొత్తం రూ.1300 ఖర్చు చేశారని జీవో కాపీల పీడీఎఫ్​ని మహేశ్వరంలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించి విడుదల చేశారు. వాటిని శ్రీరాములు యాదవ్​కు వాట్సాప్​ద్వారా పంపించారు.

ఈ సందర్భంగా కార్తీక్​రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ నయా పైసా ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ సహకారంతో మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మంత్రి సబితా ఇంద్రారెడ్డికే దక్కుతుందని తెలిపారు. నియోజకవర్గంలో విద్యాలయాల బాగు కోసమే రూ.80 కోట్ల నిధులతో పనులు చేసినట్లు పేర్కొన్నారు.184 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో బడంగ్ పేట్, మీర్ పేట్, జల్ పల్లి, తుక్కుగూడలో రోడ్లు,సెంట్రల్ లైటింగ్, చెరువుల అభివృద్ధికి నిధులు తెచ్చి పనులు చేయించారని వెల్లడించారు. ఆర్అండ్ బీ నుంచి రూ.432 కోట్లు తెచ్చి రోడ్లు బాగు చేయించారని, నల్లాల ద్వారా నీరు అందించేందుకు రూ.331 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వీటితోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసిన నిధుల వివరాలు వెల్లడించారు. జీవో చూసైనా తెలుసుకోవాలని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు.