‘ఇండియన్ ఐడల్’ 12వ సీజన్ విజేతగా ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్ రాజన్ నిలిచారు. దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను అలరించే ఇండియన్ ఐడల్ సీజన్ 12 గతేడాది నవంబర్‌లో ప్రారంమైంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జరిగిన గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటించారు. ఆరుగురు ఫైనలిస్టుల మధ్య హోరాహోరీగా సాగిన ఈ సింగింగ్ రియాలిటీ షోలో ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్ రాజన్ విజేతగా నిలిచాడు. తొలి రన్నరప్‌గా అరుణిత కంజిలాల్, సేలీ కంబ్లే, దానిష్ మహ్మద్, నిహల్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక మొదటి నుంచి గట్టి పోటీ ఇచ్చి ఫైనల్‌కు చేరిన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరోస్థానానికి పరిమితయ్యారు. విజేత పవన్‌దీప్‌కు ఇండియన్ ఐడల్ ట్రోఫీతోపాటు కారు, రూ.25 లక్షల నగదు అందజేశారు.

