
ఒక్క సినిమాతో బిజీ అయిపోవడం ఎలాగో పాయల్ రాజ్పుత్ని చూసే నేర్చుకోవాలి ఎవరైనా. పైగా ‘ఆర్ఎక్స్ 100’లో ఆమె చేసింది పక్కా నెగిటివ్ రోల్. మితిమీరిన గ్లామరస్ రోల్. ఫలితంగా విమర్శలు కూడా వచ్చాయి కానీ ఆమె నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. అందుకే వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉంది పాయల్ రాజ్‌పుత్. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ఆమెను వెతుక్కుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. ఈమె త్వరలో తేజ డైరెక్షన్‌లో నటించబోతోందట. ఆయన గత చిత్రం ‘సీత’లో ఐటమ్ సాంగ్ చేసింది పాయల్. అప్పుడు పాయల్ ఎఫర్ట్‌కి, టాలెంట్‌కి చాలా ఇంప్రెస్ అయ్యాడట తేజ. అందుకే తన నెక్స్ట్ సినిమాలో ఆఫర్ ఇచ్చాడని సమాచారం. నిజానికి తేజ తన తర్వాతి సినిమా కూడా కాజల్‌తోనే చేస్తాడనే వార్తలు వచ్చాయి. ఆ సినిమా కాజల్ స్వయంగా నిర్మించనుందని కూడా అన్నారు. అయితే ‘సీత’ సినిమా ఫలితం చూసిన తర్వాత కాజల్ ఈ ప్రాజెక్టు విషయంలో కాస్త తటపటాయిస్తోందట. అందుకే తేజ ఆమె స్థానంలో పాయల్‌ను తీసుకున్నాడని అంటున్నారు. ఇవన్నీ నిజమో కాదో తెలియదు. కానీ ప్రచారమైతే జోరుగానే జరుగుతోంది. ఒకవేళ నిజమే అయితే మాత్రం పాయల్ చేతిలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పడుతుంది.