V6 News

పేటీఎం గోల్డ్ సేవలు 12 వేల పిన్ కోడ్లకు..

పేటీఎం గోల్డ్ సేవలు 12 వేల పిన్ కోడ్లకు..

హైదరాబాద్​, వెలుగు: పేటీఎం గోల్డ్ తన సేవలను దేశవ్యాప్తంగా 12 వేల పిన్ కోడ్లకు విస్తరించింది. అక్షయ తృతీయ సందర్భంగా వినియోగదారులు తమ డిజిటల్ గోల్డ్ నిల్వను 24 క్యారెట్ల బంగారు నాణేలుగా మార్చుకుని నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు. ఎంఎంటీసీ–పీఎంఎంపీ సహకారంతో అందిస్తున్న ఈ సేవల్లో కొనుగోలు చేసిన బంగారాన్ని బీమా చేసిన సురక్షిత లాకర్లలో భద్రపరుస్తారు. 

దీనికి అదనపు నిల్వ చార్జీలు ఉండవు. వినియోగదారులు తమ డిజిటల్ బంగారాన్ని ఎప్పుడైనా అప్పటి మార్కెట్ ధర ప్రకారం నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. ఈ విస్తరణ ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం సులభంగా బంగారాన్ని పొందే వీలు కలుగుతుందని పేటీఎం గోల్డ్​ తెలిపింది.