న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం ఈ ఏడాది మార్చి క్వార్టర్ (క్యూ4) లో అద్భుతమైన ఫలితాలను సాధించింది. కంపెనీకి రూ.183 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. గతేడాది ఇదే సమయంలో రూ.545 కోట్ల నష్టంతో ఉన్న కంపెనీ, ఇప్పుడు లాభాల్లోకి రావడం గమనార్హం. పేటీఎం ఆదాయం ఏడాది లెక్కన 18.4శాతం వృద్ధి చెంది రూ.2,264 కోట్లకు పెరగగా, 2025–-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ రూ.552 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
కంపెనీకి వచ్చిన రెవెన్యూలో 55 శాతం పేమెంట్స్ బిజినెస్ నుంచి, 30 శాతం ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి ఉంది. పర్సనల్ లోన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్‌లో కూడా మంచి వృద్ధి కనిపిస్తోందని కంపెనీ సీఎఫ్‌ఓ మధుర్ దేవరా తెలిపారు. ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలో ఏఐపై కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ తీసుకోవడంపై తమకు ఆసక్తి లేదని స్పష్టం చేసింది.
