మన కుల గణన దేశానికి ఆదర్శంగా ఉండాలి

 మన కుల గణన దేశానికి ఆదర్శంగా ఉండాలి
  • కుల గణనపై రాహుల్‌‌‌‌కు సలహాలు, సూచనలు ఇవ్వండి
  • మేధావులు, బీసీ సంఘాల నేతలతో పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: మన దగ్గర జరుగుతున్న కుల గణన దేశానికే ఆదర్శంగా నిలవాలని పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌ అన్నారు. కుల గణనకు రాహుల్‌‌‌‌ గాంధీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ అంశంపై మేధావులు, ప్రొఫెసర్లు, బీసీ సంఘాల నేతలు రాహుల్‌‌‌‌కు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. 

ఈ నెల 5న హైదరాబాద్‌‌‌‌లో జరగనున్న కుల గణన సంప్రదింపుల సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొననున్న నేపథ్యంలో, దీనికి సంబంధించి సన్నాహక సమావేశం ఆదివారం గాంధీ భవన్‌‌‌‌లో మహేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని భారత్ జొడో యాత్రలో రాహుల్‌‌‌‌ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించాలన్నదే ఆయన ఆలోచన అని అన్నారు. 

ఈ అంశంపై ఇబ్బందులు రాకుండా న్యాయ నిపుణులతో రాహుల్ చర్చించాకే కులగణన చేస్తామని ప్రకటించారన్నారు. ఇందులో అనేక ప్రశ్నలు పొందుపరిచామని, ఇంకా ఎలాంటి అంశాలు ఉంటే సమగ్రంగా ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.

పట్టుదలతో ముందుకెళ్తున్నం..

కుల గణనకు అన్ని వర్గాలు సహకరించాలని  మహేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌ కోరారు. లీగల్ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని, సుప్రీంకోర్టు అడ్వకేట్లు, అడ్వకేట్ జనరల్‌‌‌‌తో సీఎం పలుసార్లు చర్చించారన్నారు. కుల గణనపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుదలతో ముందుకెళ్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు లంబాడీ గోర్ భోలి భాషను 8వ షెడ్యూల్‌‌‌‌లో పెడతామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని, తమ భాష గోర్ భోలిని అధికారికంగా పెట్టాలని లంబాడీ పోరాట సమితి నాయకులు పీసీసీ చీఫ్‌‌‌‌ను కోరారు. 
 
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణనలో లంబాడీ కుటుంబాల మాతృ భాష నమోదు కాలంలో గోర్ భోలి భాషను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ మీటింగ్‌‌‌‌లో ఏఐసీసీ నేత కొప్పుల రాజు, ఎంపీలు అనిల్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్‌‌‌‌చార్జి కోట నీలిమ, పవన్ మల్లాది, కార్పొరేషన్ చైర్మన్లు బెల్లయ్య నాయక్, ఓబేదుల్లా కొత్వాల్, మెట్టు సాయి కుమార్, మల్ రెడ్డి రాం రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావులు, ప్రొఫెసర్లు జస్టిస్ చంద్ర కుమార్, విశ్వేశ్వర రావ్, సింహాద్రి, వెంకట నారాయణ, భూక్య తదితరులు పాల్గొన్నారు.