జర్నలిస్టులకూ హెల్త్కార్డులు ఇవ్వాలి : బి.బసవపున్నయ్య 

జర్నలిస్టులకూ హెల్త్కార్డులు ఇవ్వాలి : బి.బసవపున్నయ్య 
  • టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య 

ముషీరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే  జర్నలిస్టులకు హెల్త్ కార్డులను ఇవ్వాలని, వారి తరఫున కంట్రిబ్యూషన్ ను ప్రభుత్వమే చెల్లించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య కోరారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద హెచ్, యూజే -టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, రిటైర్డ్​జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు.

కేంద్రం కార్మిక చట్టాలను రద్దు చేయడంతో వేజ్ బోర్డు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమైందని పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ తరహాలో ఇక్కడా ప్రత్యేక రక్షణ చట్టం తేవాలన్నారు. హెచ్ యూజే కార్యదర్శి బి.జగదీశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిగ రఘు, కార్యదర్శులు సలీమ, చంద్రశేఖర్, నిరంజన్, హెచ్ యూజే జాతీయ కౌన్సిల్ సభ్యుడు చిట్యాల మధుకర్, ఆఫీస్ బేరర్లు ప్రశాంత్, శ్రీనివాస్, ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సైదులు, నాయకులు పాల్గొన్నారు.