తిమ్మాపూర్, వెలుగు: బావిలో కాలుజారి పడి ఓ రిపోర్టర్ చనిపోయాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొరండ్లకు చెందిన బొజ్జ రాజ్‌కుమార్ రిపోర్టర్‌గాపనిచేస్తున్నాడు. శుక్రవారం బహిర్భూమికని ఎల్‌ఎండీలోకి వెళ్లి ప్రమాదవశాత్తూ కాలుజారి పడి బావిలో పడ్డాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేయగా, అప్పటికే నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో డెడ్‌బాడీని బయటకు తీయించి, పోస్టుమార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు.
