తెలంగాణ శక్తి అభియాన్ ప్రారంభం

తెలంగాణ శక్తి అభియాన్  ప్రారంభం

కోల్​బెల్ట్, వెలుగు: రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా మంచిర్యాల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ శక్తి అభియాన్’ కార్యక్రమం చేపడుతున్నట్లు మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్​ పిన్నింటి రఘునాథ్ ​రెడ్డి తెలిపారు. శుక్రవారం మంచిర్యాల హైటెక్​ సిటీలోని ఎంపీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ శక్తి అభియాన్​ప్రచార పోస్టర్లను కాంగ్రెస్ లీడర్లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. రాజకీయాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ సాధించడమే ‘శక్తి అభియాన్’ ప్రధాన లక్ష్యమన్నారు.

 మహిళలను నిర్ణయాధికారులుగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న మహిళలు, యువతులు, సామాజిక మార్పు కోసం పనిచేయాలనుకునేవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, 83677 37373, 9966482554 నంబర్లను సంప్రదించాలని కోరారు.